
భారత విదేశీ మారక నిల్వలు ఆగస్టు 21తో ముగిసిన వారంలో 1,242.2 కోట్ల డాలర్లు పెరిగి, మొత్తం 72,932.80 కోట్ల డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
ఫారెక్స్ నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 948.2 కోట్ల డాలర్లు పెరిగి 59,133.3 కోట్ల డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ వెల్లడించింది.
బంగారం నిల్వల విలువ కూడా 280.1 కోట్ల డాలర్లు పెరిగి 11,421.8 కోట్ల డాలర్లకు చేరుకున్నట్లు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి.