
పాకిస్తాన్‌లోని లాహోర్‌లో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
మార్కెట్‌లో బంగాళాదుంపలు, టమోటాల ధరలు కిలో రూ.150 నుండి రూ.300 వరకు పలుకుతుండటంతో ప్రజలు పూట గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ధరల నియంత్రణ విఫలం కావడంతో ఎల్పీజీ సిలిండర్లు నల్లబజారులో అధిక ధరలకు అమ్ముడవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.