
హైదరాబాద్ అబిడ్స్‌లో బుధవారం మధ్యాహ్నం సినీ నిర్మాత బొమ్మకు మురళికి చెందిన కారు ఢీకొనడంతో సునీత అనే మహిళ కాలుకు ఫ్రాక్చర్ అయ్యింది.
ప్రమాదం జరిగిన తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యులు నిర్మాతకు ఫోన్ చేసి చికిత్స ఖర్చులు భరించాలని కోరగా, ఆయన దురుసుగా సమాధానం ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి.
బాధితురాలి ఫిర్యాదు మేరకు అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.