
ఐపీఎల్ 2027 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ జట్టులో హార్దిక్ పాండ్యా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, కెప్టెన్సీ బాధ్యతల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి.
కొత్త కెప్టెన్ ఎంపికపై మాజీ సారథి రోహిత్ శర్మ సలహాలు తీసుకుంటున్న మేనేజ్‌మెంట్, తెలుగు స్టార్ తిలక్ వర్మ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
జట్టులో స్థిరత్వాన్ని కాపాడేందుకు సూర్యకుమార్ యాదవ్‌ను రిటైన్ చేసుకోవాలని మరియు మహేల జయవర్ధనేను మరో ఏడాది హెడ్ కోచ్‌గా కొనసాగించాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది.