
తెలంగాణ అసెంబ్లీ దగ్గర జరిగిన ఘటనపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, మహిళా ఎమ్మెల్యేలపై అనుచితంగా వ్యవహరించిన పోలీసులను వెంటనే గుర్తించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించింది.
పోలీసులపై చర్యలకు సంబంధించిన నివేదికను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందుంచాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
మహిళా ఎమ్మెల్యేలు పోలీసులతో అనుచితంగా వ్యవహరించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ, అసెంబ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే స్పీకర్‌కు మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది.