
తెలంగాణలో వివాదాస్పదంగా మారిన 22A భూముల సమస్యను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల రికార్డులను సరిచేసి, బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమస్యపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని మంత్రి పేర్కొన్నారు.