
రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల షుగర్ స్థాయిలు పెరగడం, తిన్న వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆహారాన్ని వేగంగా తినడం, చల్లని నీటితో భోజనం చేయడం, తగినంత నీరు తాగకపోవడం వంటి అలవాట్లు జీర్ణ సమస్యలకు, నీరసానికి దారితీస్తాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
మూత్ర విసర్జనను ఆపుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని, సంపూర్ణ ఆరోగ్యం కోసం జీవనశైలిని మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.