
రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రంలో ప్రభుత్వ పాఠశాలలను, ఉపాధ్యాయులను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (APTF) డిమాండ్ చేసింది.
సినిమాలోని లొకేషన్లు, యూనిఫాంలు ఏపీ ప్రభుత్వ పాఠశాలలను పోలి ఉన్నాయని, ఇది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.
చిత్ర బృందం వెంటనే స్పందించి అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి.