
అమెరికా, భారత్‌ల మధ్య ట్రేడ్ డీల్ ఖరారయ్యే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని అమెరికా అధ్యక్షుడు భారత్‌కు సుంకాల నుంచి మినహాయింపులు ఇచ్చారని మార్కో రూబియో తెలిపారు.
రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 100 శాతం వరకూ సుంకాలు విధించేందుకు అమెరికా ఇటీవల చట్టం తెచ్చింది, అయితే భారత్, చైనాలకు 60 రోజుల పాటు ట్రంప్ మినహాయింపు ఇచ్చారు.
భారత్‌తో ట్రేడ్ డీల్‌ను ఖరారు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామని రూబియో వివరించారు.