మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) టీ20 సీజన్-1 ఘనంగా ప్రారంభమైంది.
హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఈ లీగ్‌ను లాంఛనంగా ప్రారంభించగా, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ ఫ్రాంచైజీ టోర్నీలో 4 జట్లు పోటీపడుతుండగా, 7 రోజుల పాటు మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి.