
మంత్రి కొండా సురేఖ అంశాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని, ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నిరసనలు వ్యక్తమవ్వడంతో, సురేఖ కమిటీకి వరుసగా రెండు లేఖలు రాశారు.
అంతర్గత వ్యవహారాలపై తాను మాట్లాడనని పేర్కొన్న సీఎం, తన అమెరికా పర్యటనను కేంద్రం దురుద్దేశపూర్వకంగానే తిరస్కరించిందని మరోసారి పునరుద్ఘాటించారు.