
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్ ఆధ్వర్యంలో బోడుప్పల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు.
బీఆర్ఎస్ పాలనలో కుటుంబ పాలన, దొరల పెత్తనం సాగిందని, తుపాకులు గురిపెట్టి ఆస్తులు లాక్కునే సంస్కృతి వారిదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ సవాల్ విసరగా, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.