
చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందడానికి పలు ఆరోగ్య చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు.
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజూ గోరువెచ్చని నీరు తాగాలని, ఛాతీ మరియు పాదాలు కప్పేలా వెచ్చని దుస్తులు ధరించాలని తెలిపారు.
తరచుగా చేతులు కడుక్కోవడం, ఆవిరి పట్టడం మరియు 7 నుండి 9 గంటల ప్రశాంతమైన నిద్ర రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.