
భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ, సచిన్ టెండూల్కర్ ఆల్టైమ్ గ్రేట్ క్రికెటర్ అని అభిప్రాయపడ్డాడు.
సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో 34,357 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా, 100 సెంచరీలతో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
టెస్టుల్లో 200 మ్యాచ్లు ఆడిన సచిన్, 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో క్రికెట్ ప్రపంచంలో చెరగని ముద్ర వేశాడని రహానే కొనియాడాడు.