
నిబంధనల ఉల్లంఘన మరియు డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)ను మూసివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
ఆర్బీఐ ఇప్పటికే ఈ బ్యాంకు బ్యాంకింగ్ లైసెన్సును రద్దు చేయగా, తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఈ సంస్థ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి.
పేటీఎం ఫిన్టెక్కు అనుబంధ సంస్థగా ఉన్న పీపీబీఎల్, ఈ తాజా పరిణామంతో మార్కెట్ నుండి కనుమరుగు కానుంది.