
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాపై సంచలన ఆరోపణలు చేస్తూ, రష్యా యుద్ధ ప్రయత్నాలకు మద్దతుగా ఉత్తర కొరియా నుంచి 50వేల మంది సైనికులను పంపేందుకు చర్యలు జరుగుతున్నాయని తెలిపారు.
రష్యాలో ఉత్తర కొరియా సైనికులకు ప్రత్యేకంగా యుద్ధ శిక్షణ ఇస్తున్నారని, ఇది ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కొత్త పరిణామమని ఆయన పేర్కొన్నారు.
ఈ సైనిక బృందాల తరలింపు ద్వారా రష్యా తన సైనిక శక్తిని పెంచుకోవాలని చూస్తోందని, దీనిపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.