
హైదరాబాద్‌లోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థిని కారుమూరు ప్రియాంక రెడ్డికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం కల్పించింది.
ప్రియాంక మొదటి సంవత్సరం నుంచే డేటా స్ట్రక్చర్స్, కోడింగ్, ఆల్గరిథమ్స్‌పై పట్టు సాధించి, రోజుకు 1-2 గంటల ఏకాగ్రతతో చదివి ఈ విజయాన్ని అందుకున్నారు.
ప్రస్తుతం ఆమె యూకేలో అమెజాన్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తుండగా, ఆమె సాధించిన ఈ ఘనత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.