
ఐకార్-సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMFRI) శాస్త్రవేత్తలు చేపల పొడవు, వెడల్పును కొలిచేందుకు 'మత్స్యమెట్రి' అనే మొబైల్ యాప్‌ను రూపొందించారు.
ఈ యాప్ ARCore టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా చేపల కొలతలను క్షణాల్లో ఆటోమేటిక్‌గా రికార్డు చేస్తుంది.
గతంలో మాన్యువల్‌గా చేపలను పట్టుకుని కొలవాల్సి వచ్చేదని, ఇప్పుడు ఈ యాప్‌తో పరిశోధనల్లో డేటా సేకరణ సులభతరం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.