
అమెరికాలోని జార్జియాలో ఆరేళ్ల బాలుడు జాన్ మెడినా తన శాండ్విచ్ను తుపాకీ ఆకారంలో కొరికి సహ విద్యార్థికి చూపించడంతో పాఠశాల యాజమాన్యం అతడిని సస్పెండ్ చేసింది.
ఆటిజం ఉన్న తన కుమారుడిపై పాఠశాల అధికారులు 2023 నుంచి 14 సార్లు సస్పెన్షన్లు విధించారని తల్లి క్రిస్టిన్ మెడినా ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో వాటర్ బాటిల్‌ను తుపాకీలా చూపిస్తూ శబ్దాలు చేశాడనే కారణంతో కూడా బాలుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తల్లి పేర్కొన్నారు.