
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున, నిరసన తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను పోలీసులు అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
నినాదాలు రాసిన నల్ల టీషర్టులు ధరించిన కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేసి తెలంగాణ భవన్‌కు తరలించారు.
ఈ తోపులాటలో కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సహా పలువురు నేతలు గాయపడగా, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలపై దాడి ఆరోపణలపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశించింది.