
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సూచనల మేరకు రిలయన్స్ జియో కొత్త 'వాయిస్ ఓన్లీ' ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.
మొబైల్ డేటాతో సంబంధం లేకుండా కేవలం అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని వీటిని తెచ్చారు.
ఈ ప్లాన్లు రూ.147 నుంచి ప్రారంభమవుతుండగా, ప్లాన్ను బట్టి 22 రోజుల నుంచి క్యాలెండర్ నెల వరకు వ్యాలిడిటీ లభిస్తుంది.