
పరిశ్రమలకు భూ కేటాయింపులపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు అసత్యమని, నిబంధనల ప్రకారమే 5 ఎకరాల భూమిని రూ. 7.5 కోట్లకు కేటాయించామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
బుధవారం గాంధీభవన్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి 212 అర్జీలను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇదే భూమిని ఎకరాకు రూ. 90 లక్షలకే ఇచ్చిందని, అభివృద్ధిని అడ్డుకోవద్దని కేటీఆర్కు మంత్రి హితవు పలికారు.