
బిగ్ బాస్ 10 షోలో గోట్ ఆఫ్ ఎండ్యురెన్స్ టాస్క్ హోరాహోరీగా సాగింది.
ఈ టాస్క్‌లో అమన్ తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కించుకుని విజయం సాధించడంతో పాటు గ్రీన్ జోన్‌లోకి ప్రవేశించారు.
మరోవైపు ఈ టాస్క్‌లో బిగ్ బాస్ నిబంధనలు మార్చడంతో నరేష్ తీవ్ర ఆవేదన చెంది కన్నీరుమున్నీరు కాగా, ఆట తీరుపై ముకేశ్ విమర్శలు గుప్పించారు.