
విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేశారు.
భీమిలీ నియోజకవర్గ సమన్వయకర్త పదవితో పాటు జిల్లా అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ పంపారు.
గత కొంతకాలంగా భీమిలీ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న మజ్జి శ్రీనివాసరావు, గతంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.