
మియాపూర్ భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, రూ.50 వేల కోట్ల విలువైన భూములను కాపాడామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
కోర్టు తీర్పు రాగానే మియాపూర్లోని 550 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు ఇతర ప్రాంతాల్లోని ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులను ఆదేశించామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల కాలంలో మొత్తం రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రక్షించామని ఆయన వెల్లడించారు.