
ఉత్తర కొరియా అక్టోబర్ 30న అత్యాధునిక సాంకేతికత, కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన 600 మి.మీ. సామర్థ్యం గల స్నిపర్ మల్టిపుల్ రాకెట్ లాంచర్‌ను తొలిసారిగా ఆవిష్కరించి పరీక్షించింది.
ఈ ప్రదర్శనలో భాగంగా ఒకేసారి పది కంటే ఎక్కువ లాంచర్లతో కాల్పులు జరపడంతో పాటు డ్రోన్లు, ఆత్మాహుతి డ్రోన్ల దాడులను ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు.
మారుతున్న యుద్ధ పరిస్థితుల్లో సైన్యం డ్రోన్ల యుద్ధంలో సంపూర్ణ ఆధిపత్యం సాధించాలని, శక్తిమంతమైన దేశంగా ఉంటేనే శాంతిని కాపాడుకోగలమని కిమ్ స్పష్టం చేశారు.