
సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో మారుతి సుజుకీ నికర లాభం 26.36 శాతం తగ్గి రూ.2,466.1 కోట్లకు పరిమితమైంది.
పశ్చిమాసియా ఘర్షణల వల్ల ముడిసరుకుల వ్యయం పెరగడమే లాభాలు తగ్గడానికి ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది.
ఈ త్రైమాసికంలో కంపెనీ రాబడి రూ.53,355.5 కోట్లకు పెరిగిందని, రికార్డు స్థాయిలో 6,96,654 యూనిట్ల వాహనాలను విక్రయించామని వెల్లడించింది.