
ఇరాన్‌కు చెందిన సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానం మషద్ నుంచి కెర్మాన్‌షాకు బయలుదేరిన కొద్దిసేపటికే కుదుపులకు గురైంది.
ల్యాండింగ్ గేర్ టైరు ఊడిపోయి ఇంజిన్‌ను తాకడంతో సాంకేతిక సమస్య తలెత్తి విమానాన్ని తిరిగి మషద్‌కు మళ్లించారు.
ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని, అధికారులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారని అధికారులు తెలిపారు.