
విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న ప్రమాదంలో రాజాం జీఎంఆర్ఐటీ విద్యార్థి ఆర్. గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాద సమయంలో హెల్మెట్ కిందపడిపోవడంతో గౌతమ్ తలకు తీవ్ర గాయమైందని, మరొక విద్యార్థి రవికిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.
మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో బస్సు బైక్ను పది మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిందని అధికారులు పేర్కొన్నారు.