
సీఎం రేవంత్ రెడ్డిపై తన కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ స్పందించారు.
ఈ అంశంపై తాను పీసీసీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చానని, కొత్తగా చెప్పేదేమీ లేదని ఆమె తెలిపారు.
ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చాక ఈ విషయంపై మాట్లాడతానని కొండా సురేఖ పేర్కొన్నారు.