
ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండగా, నిమజ్జన ఏర్పాట్ల నిమిత్తం రాత్రి 12 గంటల తర్వాత దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సుమారు 50 టన్నుల బరువున్న ఈ గణేశ్ విగ్రహాన్ని తరలించేందుకు ఏపీ నుంచి భారీ టస్కర్‌ను రప్పించగా, శోభాయాత్ర కోసం 20 వేల మంది పోలీసులను మోహరిస్తున్నారు.
శోభాయాత్ర భద్రతను పర్యవేక్షించేందుకు 10 వేల కెమెరాలు, 24 డ్రోన్లతో పాటు ట్యాంక్‌బండ్ వద్ద ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.