
ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 90 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, విజయనగరం, విశాఖపట్నం సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాబోయే రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.