
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులను రాజకీయ కక్షతో కేసీఆర్ గతంలో నిలిపివేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.
పనులు సకాలంలో పూర్తయి ఉంటే రూ.1,000 కోట్లతో రెండేళ్లలోనే నల్గొండలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.300 కోట్లు చెల్లించి పనులను పునరుద్ధరించిందని, 2028 జూలై నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.