
యుఎస్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అమెరికన్ టెన్నిస్ స్టార్ కోకో గాఫ్‌పై వరల్డ్ నంబర్ 2 ఎలెనా రైబాకినా విజయం సాధించింది.
శుక్రవారం జరిగిన ఈ హోరాహోరీ పోరులో 3-6, 6-4, 6-4 తేడాతో గెలుపొందిన రైబాకినా ఫైనల్‌కు దూసుకెళ్లింది.
సెప్టెంబర్ 12న జరగనున్న తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అరినా సబాలెంకాతో రైబాకినా తలపడనుంది.