
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగాలకు డిమాండ్ పెరగడంతో, 2024 నుండి 2026 మధ్య ఈ రంగంలో వేతనాలు 23 శాతం పెరిగాయి.
ఏఐ రంగంలో 0-3 ఏళ్ల అనుభవం ఉన్నవారికి ఏడాదికి రూ.8.87 లక్షల నుండి రూ.15.41 లక్షల వరకు, 15 ఏళ్ల అనుభవం ఉన్నవారికి రూ.89.24 లక్షల వరకు వేతనం లభిస్తోంది.
బెంగళూరులో సీనియర్ ఏఐ నిపుణులకు రూ.61.70 లక్షల నుండి రూ.91.25 లక్షల వరకు వేతనం అందుతుండగా, హైదరాబాద్ కూడా వేగంగా ఎదుగుతున్న మార్కెట్‌గా నిలిచింది.