
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో 13, 14 ఏళ్ల వయసు గల ఇద్దరు హిందూ సోదరీమణులను అపహరించి, బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి వివాహం చేశారు.
కోర్టు విచారణ సందర్భంగా బాలికలు న్యాయమూర్తి ఎదుట కన్నీరుమున్నీరవుతూ తమను తల్లిదండ్రుల వద్దకు పంపాలని వేడుకున్నారు.
బాలికలను తల్లిదండ్రులకు అప్పగించేందుకు కోర్టు నిరాకరించి, ఒక సంరక్షణ కేంద్రానికి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.