
ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.7,823 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
గత ఏడాదితో పోలిస్తే కంపెనీ లాభాల్లో 6 శాతం వృద్ధి నమోదైనట్లు సంస్థ వెల్లడించింది.
ఈ ఆర్థిక ఫలితాల సందర్భంగా వాటాదారులకు ఒక్కో షేరుకు ₹26 డివిడెండ్ ప్రకటించారు.