
జానపద కళాకారిణి నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తున్న 'శనార్తి' చిత్రం శుక్రవారం ప్రారంభమైంది.
సంపత్ నంది టీమ్ వర్క్స్ మరియు శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ గణేష్ ఉప్పునూతి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ రాజ్ హీరోగా నటిస్తుండగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.