
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'స్పిరిట్' చిత్రం నుండి నటి దీపికా పదుకోన్ తప్పుకున్నట్లు నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేశారు.
దీపికా పదుకోన్ భారీ రెమ్యూనరేషన్‌తో పాటు సినిమా నికర లాభాల్లో 10 శాతం వాటా (ప్రాఫిట్ షేర్) డిమాండ్ చేయడం వల్లే ఆమెను ప్రాజెక్ట్ నుండి తప్పించినట్లు ప్రణయ్ తెలిపారు.
దీపికా స్థానంలో నూతన నాయిక త్రిప్తి డిమ్రీని ఖరారు చేశామని, సినిమాకు సంబంధించిన గోప్యమైన విషయాలను దీపికా పీఆర్ టీమ్ లీక్ చేసిందని ఆయన ఆరోపించారు.