
2013 ఐపీఎల్ సమయంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన వివాదంపై మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి స్పందించారు.
ఉత్తర భారత క్రికెటర్లలో దూకుడు సహజమని, అయితే ఆ దూకుడు హద్దులు దాటకూడదని చౌదరి అభిప్రాయపడ్డారు.
కోహ్లీకి ఎటువంటి దురుద్దేశం ఉండదని, అతని దూకుడు ఆటలో ఉత్సాహాన్ని నింపుతుందని అనిల్ చౌదరి పేర్కొన్నారు.