
ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫీచర్ ఫోన్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేసేందుకు ఫోన్‌పే 'యూపీఐ 123పే' సేవలను ప్రారంభించింది.
ఈ సేవలు ఎస్‌ఎంఎస్ ఆధారిత సాంకేతికతతో పనిచేస్తాయని, 20 కోట్ల మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని సంస్థ తెలిపింది.
నోకియా, లావా, ఐటెల్ వంటి హ్యాండ్‌సెట్ తయారీ సంస్థలతో ఫోన్‌పే ఒప్పందం కుదుర్చుకుంది.