ఆర్బీఐ రెపో రేటును పెంచినప్పటికీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిధుల ఆధారిత వడ్డీ రేట్లను (ఎంసీఎల్ఆర్) గరిష్ఠంగా 15 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
సవరించిన కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 7, 2026 నుంచే అమల్లోకి వస్తాయని, దీనివల్ల ఫ్లోటింగ్ రేటుతో లోన్లు తీసుకున్నవారికి ఈఎంఐ భారం తగ్గనుంది.
ఈ తగ్గింపుతో వివిధ టెన్యూర్లను బట్టి కనీస ఎంసీఎల్ఆర్ 7.80 శాతం నుంచి గరిష్ఠంగా 8.55 శాతంగా కొనసాగనుంది.