డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరిస్ తయారు చేసిన హెచ్ఐవీ నివారణ జెనరిక్ ఇంజెక్షన్ 'లెనాకాపావిర్'కు అమెరికా ఎఫ్డీఏ తాత్కాలిక అనుమతిచ్చింది.
ఆరు నెలలకు ఒకసారి చొప్పున ఏడాదికి రెండు డోసులు తీసుకుంటే ఈ ఇంజెక్షన్ రక్షణ కల్పిస్తుంది.
గిలియడ్ సైన్సెస్ లైసెన్స్ ఒప్పందం ప్రకారం 120 దేశాల్లో ఒక్కో వ్యక్తికి ఏడాదికి సుమారు 40 డాలర్లకే ఈ మందును అందించనున్నారు.