
కామన్వెల్త్ క్రీడల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకాన్ని సాధించి సత్తా చాటింది.
రుతుస్రావ నొప్పిని సైతం లెక్కచేయకుండా పతకం గెలవాలనే సంకల్పంతో పోటీలో పాల్గొన్నట్లు ఆమె వెల్లడించింది.
తొలి లిఫ్ట్ చేసిన తర్వాత తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, నొప్పిని అధిగమించి పతకం సాధించడం సంతోషంగా ఉందని జ్ఞానేశ్వరి పేర్కొంది.