
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడే రకాల ఉద్యోగాలు ఉంటాయని టెక్ నిపుణురాలు క్లారా షి విశ్లేషించారు.
ఏఐని రూపొందించేవారు, ఏఐని వినియోగించేవారు, ఏఐ పర్యవేక్షణలో పనిచేసేవారు అని ఆమె వివరించారు.
అమెరికాలో ఇటీవలి కాలేజీ గ్రాడ్యుయేట్లలో ప్రతి ఇద్దరిలో ఒకరు నిరుద్యోగిగా ఉండటం లేదా సంబంధం లేని పనుల్లో కొనసాగుతుండటం ఆందోళనకరమని ఆమె పేర్కొన్నారు.