
ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టి సావర్గం మరియు వాఘాపూర్ గ్రామాల్లో మొత్తం 20 సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు.
నేరాల నియంత్రణ మరియు ప్రజల భద్రత కోసం గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు.
యువత గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు.