
డెంగ్యూ జ్వరం తగ్గే సమయంలో ప్లేట్‌లెట్స్ 1.5 లక్షల నుంచి 4.5 లక్షల మధ్య ఉండాలని, ఈ దశ రోగికి చాలా కీలకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కడుపులో తీవ్రమైన నొప్పి, ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.
శరీరంలో నీటి కొరత రాకుండా కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ తీసుకోవాలని, డాక్టర్ సలహా లేకుండా మందులు వాడకూడదని స్పష్టం చేశారు.