థాయ్‌లాండ్‌లో జరుగుతున్న లైవ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పిడుగు పడటంతో 24 ఏళ్ల ఆటగాడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ప్రమాదంలో మరో 12 మంది ఆటగాళ్లు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మ్యాచ్ జరుగుతుండగా అకస్మాత్తుగా వాతావరణం మారి పిడుగు పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది.