
స్టార్ హాస్పిటల్స్‌కు చెందిన రోగుల వ్యక్తిగత సమాచారం, హెల్త్ ప్రొఫైల్ డేటా హ్యాకింగ్‌కు గురైందని సీఈఓ రాహుల్ మెడక్కర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశారు.
హ్యాకర్లు ఈ రహస్య డేటాను ఒక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
హాస్పిటల్ అధికారిక వెబ్‌సైట్ starhospitals.in ద్వారా మాత్రమే లాగిన్ ఆధారాలతో డేటా భద్రపరుస్తామని యాజమాన్యం పేర్కొంది.