
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన కోచ్ సాధిక్ ఖాన్ను కాకినాడ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు.
ఈ నెల 16న సాధిక్ ఖాన్ వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ నోట్ రాసి నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకింది.
ప్రస్తుతం నూకరాజు, ఆయన కూతురు సౌజన్య మృతదేహాలు లభ్యం కాగా, భార్య మీనా కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.